ట్రక్‌లు, బస్సుల కోసం మిచెలిన్ కొత్త టైర్లు.. 13 శాతం వరకు ఇంధన ఆదా!

ట్రక్‌లు, బస్సుల కోసం మిచెలిన్ కొత్త టైర్లు.. 13 శాతం వరకు ఇంధన ఆదా!

హైదరాబాద్​, వెలుగు: టైర్ల తయారీ సంస్థ మిచెలిన్ వాణిజ్య వాహనాల కోసం భారతీయ రోడ్లకు అనుగుణంగా రూపొందించిన కొత్త తరం ఎక్స్ మల్టీ ఎనర్జీ జెడ్2 ట్రక్, బస్సు టైర్లను విడుదల చేసింది. వచ్చే నెల నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి.  వీటిని చెన్నైలోని మిచెలిన్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తయారు చేస్తున్నారు.  టైర్ల తయారీలో 30 శాతం వరకు రీసైక్లింగ్​ పదార్థాలను ఉపయోగించారు. ఇతర టైర్లతో పోలిస్తే ఈ టైర్లు 6 శాతం నుంచి 13 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేస్తాయి.  కార్బియాన్ మిశ్రమం కారణంగా టైర్ మన్నిక 25 శాతం వరకు పెరుగుతుంది. తమ పేటెంటెడ్​ టెక్నాలజీ ఇన్ఫినికాయిల్ వల్ల టైర్లు తడి, పొడి రోడ్లపై మెరుగైన పట్టును ఇస్తాయని మిచెలిన్​ తెలిపింది.