హైదరాబాద్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో..500కు పైగా ప్రాజెక్టులు ఒకే వేదికపై!

హైదరాబాద్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో..500కు పైగా ప్రాజెక్టులు ఒకే వేదికపై!
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నరెడ్కో ప్రాపర్టీ షో  
  • చీఫ్​ గెస్టులుగా మంత్రులు భట్టి, అడ్లూరి

హైదరాబాద్​, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్​మెంట్​ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ విభాగం 16వ ప్రాపర్టీ షో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం ప్రారంభమైంది.  ఇది వచ్చే నెల ఒకటో తేదీ వరకు కొనసాగనుంది. తెలంగాణ ఉప–ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 500 ప్రాజెక్టులకు పైగా డెవలపర్లు, ఆర్థిక సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ ప్రాపర్టీలతో పాటు ఫైనాన్సింగ్ ఆప్షన్లపై అవగాహన కల్పిస్తున్నారు. 

హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే రూ.84,790 కోట్ల పనులకు రూపకల్పన చేశామని, ఇందులో రూ.55వేల కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని భట్టి తెలిపారు. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో అద్భుతమైన వేదిక అని నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కస్టమర్లకు అవసరమైన అన్ని ప్రాపర్టీలు ఒకే చోట లభిస్తాయని చెప్పారు.