మినీ ట్యాంక్‌‌ బండ్‌‌ గా ఫాక్స్ సాగర్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్

మినీ ట్యాంక్‌‌ బండ్‌‌ గా ఫాక్స్ సాగర్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ,  వెలుగు:  జీడిమెట్లలోని 129 ఏండ్ల చరిత్ర కలిగిన ఫాక్స్ సాగర్ చెరువును మినీ ట్యాంక్‌‌బండ్‌‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 490 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో 150 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కలిసి ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. పట్టా భూములు ఉన్నవారికి చట్టప్రకారం టీడీఆర్ కల్పిస్తామన్నారు. 

10 అడుగుల మేర పూడిక

చెరువులో 10 అడుగుల మేర పూడిక, పారిశ్రామిక వ్యర్ధాలు పేరుకుపోయాయ ని కమిషనర్ తెలిపారు. వాటినిపూర్తిగా తొలగించి మంచినీటి సరస్సుగా మారు. స్తామని అన్నారు. మురుగు, పారిశ్రా మిక వ్యర్థాలు చెరువులో కలవకుండా కాలువలను మళ్లించడంతో పాటు ఎస్టీ పీల ద్వారా శుద్ధి చేసిన నీటిని చెరువులో కి మళ్లిస్తామని వివరించారు. తొలిదశ పనులను రూ.75 కోట్లతో చేపట్టను న్నట్లు వెల్లడించారు. హైద్రా అదనపు కమిషనర్ ఆనంద్కుమార్, ఎసీపీ పి తిరుమల్ పాల్గొన్నారు.