ఢాకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడింది. కరీబియన్ బౌలర్లు రోస్టన్ ఛేజ్ (3/25), జోమెల్ వారికన్ (2/19) చెలరేగడంతో.. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 79/6 స్కోరు చేసింది.
జాకెర్ అలీ (18 బ్యాటింగ్), నయీమ్ హసన్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 134/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 82.5 ఓవర్లలో 245 రన్స్‌కు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (46), రోస్టన్ ఛేజ్ (43 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
