జ్యోతిష్యం: నవంబర్ నెల సింహ రాశి.. ఆగిపోయున పనులు వేగవంతం.. ఈ రాశి వారి పంట పండినట్టే..!

జ్యోతిష్యం: నవంబర్ నెల సింహ రాశి.. ఆగిపోయున పనులు వేగవంతం.. ఈ రాశి వారి పంట పండినట్టే..!

నవంబర్​ నెలలో పరమేశ్వరుడికి ఇష్టమైన కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది.   గ్రహాలు  వాటి స్థానాల్లో కీలక మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాల సంచారంలో జరిగిన మార్పుల వలన సింహరాశి వారికి 2026 నవంబర్​ నెలలో  ఆర్థిక స్థిరత్వం, నిలిచిపోయిన పనులకు ఊపందుకుంటాయి.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఈ ఏడాది ( 2026)చివరి రెండు నెలలు ( నవంబర్​, డిసెంబర్​) ఆర్థిక పరమైన ఊరటను ఇస్తాయి.ఈ నెల (2026 నవంబర్​​ సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఈస్టోరీలో తెలుసుకుందాం. . .

  • నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  •   నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  •  నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

నవంబర్ 2026లో సింహ రాశి వారికి గ్రహ సంచారాల ఆధారంగా కెరీర్​ విషయంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీరు చేపట్టిన పనులు స్పీడందుకుంటాయి.  ప్రమోషన్​ కోసం ఎదురు చూస్తు ఉద్యోగస్తులు గుడ్​ న్యూస్​ వింటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  బంధువులు, స్నేహితులు చెప్పిన విషయాలను పట్టించుకోవద్దు.  చిన్న చిన్న విషయాలకు ఆవేశ పడవద్దని పండితులు చెబుతున్నారు. 

ఈ నెలలో ఈ రాశి వారు కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.  ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామి నుంచి మీకు మద్దతు లభించవచ్చు.  నవంబర్​ 13 తరువాత ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. వేగంగా ఆదాయ వృద్ధి చోటు చేసుకుంటుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడం, ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావడం, సొంత ఇల్లు అమరడం వంటివి జరుగుతాయి. ఉద్యో గంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ALSO READ : జ్యోతిష్యం: గ్రహాల మార్పు ప్రభావం..నవంబర్ నెల కర్కాటక రాశి వారికి అవకాశాల పండుగ..!

ఈ రాశి వారికి  ఆత్మవిశ్వాసం పెరగడానికి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.  పాత ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధించవచ్చు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. మీ నాయకత్వ లక్షణాలకు పని ప్రదేశంలో గుర్తింపు లభించవచ్చు. పారిశ్రామికవేత్తలు కొత్త ప్రాజెక్టులు, వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడిపే అవకాశం లభించే అవకాశం ఉంది. 

కుజుడు ఇదేరాశిలో గురుడితో కలిసి ఉంటాడు. 
కేతువు ప్రభావం వలన తీవ్రమైన ఆత్రుత , ఆకస్మిక నిరాసక్తత

పరిహారం: ప్రతిరోజూ ఆదిత్య హృదయం పారాయణం 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.