నవంబర్ మాసంలో కార్తీకమాసం ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 నవంబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో గ్రహాల మార్పు ప్రభావంతో మిథునరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . !
- నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు) శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 14న కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 13న తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం
మిథునరాశి రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయని పండితులు అంచనా వేస్తున్నారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొవాలని పండితులు సూచిస్తున్నారు.స్నేహితుల సహకారం లభించే అవకాశం ఉంది. ఈ నెలలో గ్రహ సంచారాల ఆధారంగా ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి నూతనఅవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
ఈ రాశి వారు నవంబర్ 2026 లో ఏ విషయంలో కూడా తొందరపడవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయమయ్యే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ వ్యవహారాలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని కూడా సమయస్ఫూర్తిగా వ్యవహహరించే అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
వ్యాపారస్తులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలి. ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిసారించాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. పొదుపుపై దృష్టిసారించాలి. లో విద్యార్థులు చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. ఉన్నత విద్య కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తులు, ప్రవేశ గడువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ALSO READ : జ్యోతిష్యం: నవంబర్ నెల.. వృషభరాశి వారు కెరీర్ లో అభివృద్ది..
కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా, సమస్యకు కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పని, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి. ప్రేమ వ్యవహారాలు బలపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
- తొమ్మిదవ ఇంట్లో రాహువు అదృష్టాన్ని బలహీనపరుస్తాడు
- ఐదవ ఇంట్లో బుధుడు సంచరించారం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
- బుధుడు నవంబర్ 13న తన దిశను మార్చుకోవడం వలన ఈ రాశి వారికి ఆలోచనల విషయంలో స్పష్టత
పరిహారం: ప్రతిరోజూ విష్ణు సహస్రనామం జపించండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
