జ్యోతిష్యం: నవంబర్‌ నెల కన్యారాశి ఫలితాలు..కొత్త ఆశలు చిగురింపు..ఆర్థికంగా ఊహించని లాభాలు..

జ్యోతిష్యం: నవంబర్‌ నెల కన్యారాశి ఫలితాలు..కొత్త ఆశలు చిగురింపు..ఆర్థికంగా ఊహించని లాభాలు..

కన్యారాశి వారికి 2026 నవంబర్​ లో గ్రహాల మార్పు వలన సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వలన ఈ రాశి వారికి  అదృష్టం  ఇంటి తలుపు తడుతుంది. ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది.  2026 నవంబర్​ నెలలోఈ  రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందాం. . .! 

  • నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  •   నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  •  నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

 కన్యా రాశి వారికి నవంబర్ 2026లో  ఉద్యోగం, వ్యాపారం,  ఆర్థిక రంగాల్లో అనుకూలమైన ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి.ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి. చాలా కాలం నుంచి ప్రమోషన్​ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. సహోద్యోగుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. 

ఇక ఆర్థిక విషయాలకు వస్తే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.వారసత్వ ఆస్తి విషయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. బంధువులతో సత్సంబంధాలు బలపడతాయి.

ALSO READ : జ్యోతిష్యం: నవంబర్ నెల సింహ రాశి.. ఆగిపోయున పనులు వేగవంతం.. 

 లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి బుధుడు దశమ, లాభ స్థానాల్లో బలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అంచనాలకు మించి లాభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.  సొంత ఇంటి కల నెరవేరడంతో పాటు వాహన యోగం కూడా కలుగుతుంది. ఆస్తులు బాగా కలిసి వస్తాయి. రుణ సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. ప్రేమికుల మధ్య సంబంధాలు బలపడతాయి. 

  •  ఆరవ ఇంట్లో రాహువు సంచారం వలన ప్రతిపనిలో కూడా విజయం 
  •  పన్నెండవ ఇంట్లో కేతువు  సంచారం వలన నిద్రకు భంగం, ఒత్తిడి కలిగే అవకాశం 
  •  బృహస్పతి శుభ స్థానంలో సంచారం వలన  వ్యాపార లాభాలు తగ్గవచ్చు. 

పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు  ఓం కేతవే నమః అనే మంత్రాన్ని జపం చేయాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.