జ్యోతిష్యం : నవంబర్ నెల తులా రాశి వారికి గోల్డెన్ మంత్..ఆర్థిక లాభాలు తన్నుకొస్తాయి..

జ్యోతిష్యం : నవంబర్ నెల తులా రాశి వారికి గోల్డెన్ మంత్..ఆర్థిక లాభాలు తన్నుకొస్తాయి..

తులారాశి వారికి నవంబర్​ 2026 అద్భుతమైన ప్రయోజనాలను ఇచ్చే మాసమని పండితులు చెబుతున్నారు. గురుడి అనుకూల ప్రభావం వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా అభివృద్దితో పాటు  మీ వృత్తి జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్లు లేదా జీతం పెంపు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి 2026 నవంబర్​ నెల గోల్డెన్​ మంత్​ అని పండితులు చెబుతున్నారు. 

  • నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  • నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  • నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  • నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

 తులా రాశి వారికి నవంబర్ 2026లో గ్రహాల స్థితిగతుల ప్రకారం కెరీర్, ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి  ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులకు సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. ఆఫీసర్ల నుంచి ప్రశంశలు అందుకుంటారు.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

ఈ రాశి వారికి ఈ నెలలో  వృత్తిపరంగా మరింత ఉత్సాహం పెరుగుతుంది. కొత్త ఒప్పందాల వలన లాభాలు కలుగుతాయి.కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  సహోద్యోగుల సహకారంతో పని సజావుగాపూర్తిచేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఎదురవుతున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో నెలకొన్న మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది.

ALSO READ : జ్యోతిష్యం: గ్రహాల మార్పు ప్రభావం..నవంబర్ నెల కర్కాటక రాశి వారికి అవకాశాల పండుగ..!

ఈ రాశి వారికి ఈ​ నెలలో ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పాత బకాయిలు వసూలు కావడంతో కొత్తగా ఆస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. దూరప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు, దంపతుల మధ్య అనుబంధం మధురంగా సాగుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

బృహస్పతి, శని , కేతువు సంచారం వలన .. అన్ని రంగాల్లో విజయం
 బృహస్పతి , శుక్రుల   కారణంగా కుటుంబ జీవితం సామరస్యం, ఆనందం

పరిహారాలు: ప్రతి సోమవారం, శివునికి పచ్చి పాలు, నీటితో అభిషేకం 
శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారిని పూజించండి.
చంద్రుడి ఆశీస్సుల కోసం "ఓం చంద్రాయ నమః"  అనే మంత్రాన్ని ప్రతి రోజు ప్రదోష కాలంలో అంటే  సాయంత్రం చంద్రోదయ వేళ 108 సార్లు  పఠించండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.