దీపావళి సందర్భంగా వన్‌ప్లస్ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లపై అదిరిపోయే డిస్కౌంట్లు! దీపావళి పండగను సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వీటికి అదనంగా బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పండుగ సీజన్ కావడంతో ఇప్పటికే చాలా కంపెనీలు ప్రత్యేక తగ్గింపులు ప్రకటిస్తున్నాయి. వన్‌ప్లస్ కూడా ఇదే బాటలో పలు ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లను వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ రిటైల్ స్టోర్లలో పొందవచ్చు. వన్‌ప్లస్ ప్రకటించిన ఆఫర్లు ఏంటి ? ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తోంది ? వివరంగా తెలుసుకుందామా....
వన్‌ప్లస్ 15
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.84,999గా ఉంది. దీనిపై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.81,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.37,600 వరకు ఎక్స్ట్రా డికౌంట్ పొందే అవకాశం ఉంది. అన్ని ఆఫర్లు వర్తిస్తే ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
వన్‌ప్లస్ 15R
256GB స్టోరేజ్, 12GB ర్యామ్‌తో వచ్చే వన్‌ప్లస్ 15R ధర రూ.69,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ ఫోన్‌ను సుమారు రూ.46,750కే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 6
ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 ధర రూ.47,999గా ఉంది. ఈ ఫోన్‌పై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ వంటి ఆఫర్లను కలిపి తీసుకుంటే ఈ ఫోన్‌ను సుమారు రూ.36,400కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 4
ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి కూడా వన్‌ప్లస్ మంచి ఆఫర్ ప్రకటించింది. వన్‌ప్లస్ ప్యాడ్ 4 ధర రూ.62,999గా ఉంది. దీనిపై రూ.4,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆఫర్‌తో ట్యాబ్లెట్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్
తక్కువ బడ్జెట్‌లో ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ మంచి ఆప్షన్. దీని ధర రూ.22,999గా ఉంది. దీనిపై రూ.2,000 తగ్గింపు అందిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లతో పాటు వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్‌పై కూడా ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది.
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3: రూ.8,999 ధరకు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ బడ్స్ 4: రూ.5,399 ధరకు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో: ఆఫర్ ధర రూ.3,599.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4: రూ.2,699 ధరకు లభిస్తోంది.
ఎక్కడ కొనుగోలు చేయాలి?
వన్‌ప్లస్ ప్రకటించిన ఈ దీపావళి ఆఫర్లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వన్‌ప్లస్ రిటైల్ స్టోర్లలో పొందవచ్చు. అయితే బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వాటికి సంబంధించిన నిబంధనలు ప్లాట్‌ఫామ్‌ను బట్టి మారవచ్చు.
కాబట్టి కొనుగోలు చేసే ముందు ఆయా వెబ్‌సైట్లలో ఆఫర్ల వివరాలు, అర్హతలు, తుది ధరలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
