పోలాండ్‌లో రాజ్యాంగ సంక్షోభం.. కోర్టు చీఫ్ సస్పెన్షన్‌తో రోడ్డెక్కిన వేలాది మంది ప్రజలు

పోలాండ్‌లో రాజ్యాంగ సంక్షోభం.. కోర్టు చీఫ్ సస్పెన్షన్‌తో రోడ్డెక్కిన వేలాది మంది ప్రజలు

పోలాండ్‌లో తీవ్ర రాజ్యాంగ,రాజకీయ సంక్షోభం నెలకొంది. పోలాండ్‌లో రాజ్యాంగ న్యాయస్థానం అధ్యక్షుడి సస్పెన్షన్, న్యాయవ్యవస్థ నియంత్రణకు కుట్రచేస్తున్నారంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రాజధాని వార్సాలో నిరసనకారులు, ప్రతిపక్ష మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అర్థరాత్రి వేలాది మంది ప్రజలు కోర్టు భవనాన్ని చుట్టు ముట్టారు.  

పోలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం అధ్యక్షుడు బొగ్డాన్ శ్వియెచ్‌కోవ్‌స్కీ, డిప్యూటీలను నెల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు జడ్జి అన్నా కార్విన్-పియోట్రోవ్‌స్కా ప్రకటించారు. న్యాయశాఖ మంత్రి వారి ప్రాసిక్యూషన్ మినహాయింపును తొలగించాలని కోరడం, బొగ్డాన్  సస్పెన్షన్ తో వివాదం ముదిరింది.

ప్రస్తుత ప్రధాని డోనాల్డ్ టస్క్ నేతృత్వంలోని యూరోపియన్ల పోలాండ్ ప్రభుత్వం, న్యాయవ్యవస్థలో పాత నిబంధనలను మార్చి చట్టబద్ధతను పునరుద్ధరిస్తున్నాం అని తెలిపింది. అయితే, గతంలో అధికారంలో ఉన్న రైట్-వింగ్ ప్రతిపక్ష పార్టీ (PiS) దీనిని ప్రభుత్వ కు ట్ర అని విమర్శించింది. తమ మద్దతుదారులతో కలిసి భారీ నిరసనలు చేపట్టింది.

దేశంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో ఆఫ్రికా పర్యటనలో ఉన్న పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోత్స్కీ మధ్యలోనే తిరిగి వార్సాకు చేరుకుని నిరసనకారులకు మద్దతుగా తెలిపారు. 

ఈ వివాదానికి కొద్ది రోజుల ముందే పోలాండ్ లో  ఉచిత,చట్టబద్ధమైన గర్భస్రావ హక్కుల అంశం తెరపైకి వచ్చి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశవ్యాప్తంగా 20 నగరా్లలో మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేశారు.