కర్కాటక రాశి వారికి ఈ నెల ( నవంబర్ 2026) కొత్త అవకాశాల పండుగగా మారనుంది. అన్ని రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి శుభప్రదమైన నక్షత్రాలు తోడుగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 2026 వ సంవత్సరం నవంబర్ నెలలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
- నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు) శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 14న కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 13న తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
- నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం
- నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం
నవంబర్ 2026 కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితిగతుల ప్రకారం శుభ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కెరీర్ మంచి పురోగతి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.ఉద్యోగంలో స్థిరత్వం, ఉన్నత పదవులు లభించడంతో పాటు ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే కొన్నిసార్లు ఒత్తిడి, అదనపు బాధ్యతలు .. చిన్నపాటి జాప్యాలు జరిగే అవకాశం ఉంది.
బృహస్పతి శుభ దృష్టి వలన ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు రాబడి అంచనాలను మించుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖంపడతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు.
చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రాహువు , కేతువుల ప్రభావంతో కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు,, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలనిజ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ALSO READ : జ్యోతిష్యం: మిథునరాశి వారి జాతకం..
ఈ రాశి వారికి నవంబర్ నెలలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఛాలెంజ్‌లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కాకపోతే, చిన్నచిన్న ఒత్తిళ్లు ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పనిని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఒత్తిడి, నిరసనతో బాధపడాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.ప్రేమ వ్యవహారం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తొమ్మిదవ ఇంట్లో శని సంచారంపనుల్లో ఆలస్యం
రెండవ ఇంట్లో బృహస్పతి సంచారం వలన ఉద్యోగం, వ్యాపారం అభివృద్ది
ఎనిమిదవ ఇంట్లో రాహువు సంచారం వలన ఆకస్మికంగా చిన్నపాటి అడ్డంకులు, ఖర్చులు పెరిగే అవకాశం
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు “ఓం రాహవే నమః” అని జపించండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
