చెరువు కబ్జా చేసి బార్ నిర్మాణం.. హైదరాబాద్ రామంతపూర్లో హైడ్రా కూల్చేవేతలు!

చెరువు కబ్జా చేసి బార్ నిర్మాణం.. హైదరాబాద్ రామంతపూర్లో హైడ్రా కూల్చేవేతలు!

రామాంతపూర్ లో  చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 2026 అక్టోబర్ 31న పోలీసుల సహకారంతో రామాంతపూర్ చెరువు ఆక్రమణలను తొలగించింది. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించిన  మధురా బార్ షెడ్ ను  హైడ్రా అధికారులు కూల్చివేశారు. బార్ తో పాటు రేకుల షెడ్డును కూడా జేసీబీతో కూల్చివేశారు. 

హైడ్రా కూల్చివేతలపై బార్ ఓనర్లు అభ్యంతరం తెలిపారు.  గత 40 ఏండ్లుగా మున్సిపల్ బిల్, కరెంట్ బిల్లు, టాక్స్  లను చెల్లిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఎఫ్డీఎల్ లో  ఉందని హైడ్రా కూల్చివేతలకు పాల్పడటం సరికాదని  ఓనర్లు నూకల గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.