వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఇంట్లో శవాలుగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ భార్య, పిల్లలు !

వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఇంట్లో శవాలుగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ భార్య, పిల్లలు !

చింతకుంట: వికారాబాద్ జిల్లా దారూర్ మండలం చింతకుంట గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

వాసవి (35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. పిల్లలు.. సహర్స్ రెడ్డి 9, వేదర్శి రెడ్డి 8 సంవత్సరాలు. వాసవి భర్త భూపతిరెడ్డి తాండురులోని ఓ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నాడు.

తన భార్య వాసవి గత 6 సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతుందని,6 సంవత్సరాలుగా మానసిక వైద్యం చేయిస్తున్నానని భర్త భూపతి రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించాడు. వాసవి తన ఇద్దరు పిల్లలకు ఇంట్లో తాడుతో ఉరివేసి అనంతరం తాను కూడా ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

సమాచారం అందుకున్న దారూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.