నల్గొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు 197.44 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో ప్రపంచ బ్యాంకు 138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 59.23 కోట్లు కేటాయించడం గమనార్హం.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పాత ఆర్ అండ్ బి కార్యాలయ స్థలంలో అధునాతన రీతిలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మించనుంది. కార్పొరేషన్ కార్యాలయంలో అభివృద్ధి పనుల లోగోను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ ఆవిష్కరించారు. నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మేయర్, కార్పొరేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
