MS Dhoni CSK Batting Coach: ఐపీఎల్ (IPL 2027) 20వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఇటీవల తమ కొత్త కోచింగ్ సిబ్బంది వివరాలను అధికారికంగా ప్రకటించింది. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan)ను హెడ్ కోచ్‌గా నియమించిన సీఎస్‌కే.. మోహిత్ శర్మ, గారెత్ బాటీ, అల్బీ మోర్కెల్‌లకు అసిస్టెంట్ కోచ్‌లుగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ కోచింగ్ స్టాఫ్‌లో బ్యాటింగ్ కోచ్‌ను సెలక్ట్ చేయలేదు, ఇకపై కొత్తగా ఏ కోచ్‌ను తీసుకోబోమని సీఎస్‌కే సీఈఓ స్పష్టం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీఎస్‌కే మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ (S. Badrinath) స్పందిస్తూ సంచలన విశ్లేషణ చేశాడు.
బ్యాటింగ్ కోచ్, మెంటార్గా ధోనీ: బద్రీనాథ్
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఉన్నాడని జోస్యం చెప్పాడు. చెన్నై ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లను నియమించుకుంది. కానీ బ్యాటింగ్ కోచ్‌ను మాత్రం ఎంపిక చేయలేదు.. ఇకపై బ్యాటింగ్ కోచ్ ఉండరని సీఈఓ కూడా చెప్పారు.. నా అంచనా ప్రకారం ఎంఎస్ ధోనీనే సీఎస్‌కే జట్టుకు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. మహీ భాయ్ ఆ బాధ్యతలు చూసుకుంటాడనే ఉద్దేశంతోనే ఫ్రాంచైజీ కావాలనే వేరే బ్యాటింగ్ కోచ్‌ను తీసుకోలేదని నేను భావిస్తున్నాను అని బద్రీనాథ్ వెల్లడించాడు.
IPL 2027 నాటికి ధోనీ రిటైర్మెంట్:
* ఐపీఎల్ 2025 వేలానికి ముందు ధోనీని 'అన్‌క్యాప్డ్ ప్లేయర్' కేటగిరీ కింద రూ. 4 కోట్లకు సీఎస్‌కే మూడేళ్ల కాలపరిమితితో రీటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
* గాయాలతో దూరం: ఐపీఎల్ 2025 తర్వాత ధోనీ ఎలాంటి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడలేదు. 2026 సీజన్ ఆరంభంలో గాయం కాగా, వార్మప్ మ్యాచ్‌లో మళ్లీ గాయపడటంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
►ALSO READ | CSKలోకి హార్దిక్ వస్తున్నాడా? నెట్టింట చెన్నై క్రిప్టిక్ పోస్ట్.. ఫ్యాన్స్ డీకోడింగ్ వైరల్!
* సంజు ఎంట్రీ.. ధోనీ మెంటార్ రోల్: సీఎస్‌కే జట్టులో ప్రస్తుతం సంజు శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉన్నందున, ధోనీ తుది జట్టులో ఆడకపోయినా 2027 సీజన్ ముగిసే వరకు అన్-ఆఫీషియల్ మెంటార్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా జట్టుతో ప్రయాణించే అవకాశం ఉందని సమాచారం. 2027 ఐపీఎల్ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాతే ధోనీ ప్లేయర్‌గా వీడ్కోలుపై తుది నిర్ణయం తీసుకోనున్నాడు.
🚨 "MS DHONI WILL BECOME MENTOR AND BATTING COACH"🚨 Subramaniam Badrinath said 🗣️, "CSK have three assistant coaches. But there is no batting coach. I have a feeling MS Dhoni will become the mentor and batting coach. Because they have consciously not picked a batting coach. The CEO also said they will not have a batting coach. So maybe Dhoni will look into it, and the decision has been made based on that."
— Cricket Central (@CricketCentrl) October 30, 2026
