యువరాజ్ బిగ్ మెసేజ్.. అభిషేక్, ఇషాన్, వైభవ్‌లకు వన్డేల్లో ఛాన్స్ దొరికేనా!

యువరాజ్ బిగ్ మెసేజ్.. అభిషేక్, ఇషాన్, వైభవ్‌లకు వన్డేల్లో ఛాన్స్ దొరికేనా!

భారత జట్టు యాజమాన్యం అనుసరిస్తున్న సెలక్షన్ విధానంపై టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఆగ్రహం వ్యక్తం చేశాడు. విధ్వంసకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan), అండర్-19 సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) లకు వన్డే (50 ఓవర్ల) జట్టులో క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వకపోవడం వారి అపారమైన ప్రతిభను తొక్కేస్తున్నారని పేర్కొన్నాడు.  

యంగ్ టాలెంట్‌కు అన్యాయం చేస్తున్నారు: 

తన మెంటార్‌షిప్‌లో యువ ప్లేయర్ల గురించి యువరాజ్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మను వన్డే జట్టులో చూడాలని నేను ఎంతగానో ఆరాటపడుతున్నాను.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి కుర్రాళ్లను వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉంచితే.. అది ఖచ్చితంగా వారి ప్రతిభకు మనం చేస్తున్న అన్యాయమే అవుతుందన్నాడు. జట్టులో దిగ్గజ ప్లేయర్లు ఉన్నందున చోటు దక్కించుకోవడం ఈజీ కాదని ఒప్పుకున్న యూవీ.. ఈ కుర్రాళ్లు ఆడుతున్న అగ్రెసివ్ క్రికెట్‌కు వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

యూవీ పాజీ ఏ క్రికెట్ ఆడాడో నాకైతే తెలీదు భయ్యా: అభిషేక్

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యువీ సోషల్ మీడియా (X) వేదికగా తంబీని ఆటపట్టిస్తూ.. నువ్వు ఇప్పటికీ 12 బంతుల్లో 50 పరుగులు కొట్టలేవు కదరా @OfficialAbhi04! మైదానంలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు తమ పెరట్లో ఆడుతున్నట్లు ఉందని ఫన్నీగా పోస్ట్ చేశాడు.

►ALSO READ | వన్డేల్లో జడేజా కెరీర్‌ ఎండ్.. అక్షర్ మెయిన్ ఆల్‌రౌండర్.. పుజారా కామెంట్స్ వైరల్!

దీనిపై ప్లాటినమ్ ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న అభిషేక్ శర్మ అంతే ఫన్నీగా స్పందిస్తూ.. ఆ రోజుల్లో యువీ పాజీ ఏ తరహా క్రికెట్ ఆడారో నాకు తెలియదు కానీ.. 12 బంతుల్లో 50 రన్స్ కొట్టడం అనేది అస్సలు అంత తేలికైన విషయం కాదు. ఏ బ్యాటర్ అయినా క్రీజులోకి వెళ్లి వెంటనే 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టేయలేడు, అది ఎప్పుడో ఒకసారి మాత్రమే సాధ్యమయ్యేది అని చెప్పుకొచ్చాడు.