రగ్బీలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ వైరల్!

రగ్బీలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ వైరల్!

భారత క్రీడా ప్రపంచంలో ఊహించని సంచలనం నమోదైంది. ప్రపంచ రగ్బీలో అత్యంత శక్తివంతమైన న్యూజిలాండ్‌ను భారత జట్టు ఏకంగా చిత్తు చేసింది. బీహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన అండర్-20 మహిళల రగ్బీ సెవెన్స్ మ్యాచ్‌లో భారత U-20 మహిళల జట్టు 17–0 తేడాతో న్యూజిలాండ్ (మావోరీ) U20 ఇన్విటేషనల్ టీమ్‌ను ఘోరంగా ఓడించింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 100 సంవత్సరాల క్రీడా సంబంధాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక సిరీస్‌లో భారత అమ్మాయిలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

ఫిజికల్ గేమ్‌ను మైండ్ గేమ్‌తో కొట్టిన భారత అమ్మాయిలు:

* న్యూజిలాండ్‌లో రగ్బీ క్రీడకు అత్యున్నత వసతులు, ప్రపంచ స్థాయి సిస్టమ్ ఉంటే.. భారత్‌లో కనీస వనరులు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ టీమిండియా చూపిన వ్యూహాత్మక ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 

* హాఫ్-టైమ్‌కే 12-0 లీడ్: మ్యాచ్ ప్రారంభమైన నిమిషం నుంచే ధాటిగా ఆడిన భారత్, మొదటి సగంలోనే 12–0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

* స్పీడ్, అగ్రెసివ్ అటాకింగ్: న్యూజిలాండ్ ఆటగాళ్ల శారీరక దృఢత్వానికి (Physicality) తలొగ్గకుండా, వేగం, త్వరిత నిర్ణయాలు, కౌంటర్ ఎటాకింగ్ మైండ్ సెట్‌తో భారత్ ప్రత్యర్థిని కోలుకోకుండా చేసి 17–0తో మ్యాచ్‌ను ముగించింది.

ఎవరైనా నన్ను గిచ్చండి సమాధానం చెప్తా: ఆనంద్ మహీంద్రా

* భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియా (X) వేదికగా అత్యంత ఆసక్తికరమైన కామెంట్ చేశారు. 

* వాట్ట్ట్? (Whaaaaaaat?) ఎవరైనా వచ్చి ఇది ఏప్రిల్ ఫూల్స్ ప్రాంక్ అని చెప్తారేమో అని భయపడుతున్నా.. కానీ ఇది ఏప్రిల్ నెల కాదు కదా! వావ్.. నమ్మలేకపోతున్నా! అంటూ ట్వీట్ చేయగా, అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

* ఆసియా రగ్బీలో భారత మహిళల విభాగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శక్తిగా ఎదుగుతున్నాయని అనడానికి ఈ విజయమే నిదర్శనం.