Bank Holidays November 2026: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో మూసివేస్తారంటే?

  Bank Holidays November 2026: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో మూసివేస్తారంటే?

నవంబర్ నెలలో ఏదైనా  బ్యాంకు పని చేయాలనీ అనుకున్నారా  ? అయితే ముందుగా ఈ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే నవంబర్ 2026లో కొన్ని పండుగలు, ప్రత్యేక రోజులు ఉండటంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసే సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో వివిధ తేదీల్లో ప్రాంతీయ పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఒక రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులు మూసివేస్తారని అనుకోవద్దు. ఆ  రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలను బట్టి సెలవులు మారుతుంటాయి.

అందుకే బ్యాంకుకు వెళ్లే ముందు బ్యాంక్ హాలిడేస్  తెలుసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా నగదు లావాదేవీలు, చెక్కుల డిపాజిట్లు, ఇతర బ్యాంకు పనులు చేసుకునేవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మరి నవంబర్ 2026లో ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి ? ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.....

 నవంబర్ నెలలో ఆదివారాలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 2026 నవంబర్‌లో అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తించే సాధారణ సెలవులు :
*ఆదివారాలు: నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.
*రెండో శనివారం: నవంబర్ 14న బ్యాంకులకు సెలవు.
*నాలుగో శనివారం: నవంబర్ 28న బ్యాంకులు మూసివేస్తారు.
*అంటే ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసివేస్తారు.

నవంబర్ 2026లో రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల లిస్ట్ 
RBI సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో పలు రాష్ట్రాల్లో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. వాటి వివరాలు చూస్తే....

నవంబర్ 1: పుదుచ్చేరి విమోచన దినోత్సవం, హర్యానా దినోత్సవం, కన్నడ రాజ్యోత్సవం, కుట్
ఈ రోజున పుదుచ్చేరి విమోచన దినోత్సవం, హర్యానా దినోత్సవం, కర్ణాటక రాజ్యోత్సవం, మణిపూర్‌లో కుట్ పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెలవు ఉండే ప్రాంతాలు  పుదుచ్చేరి, మణిపూర్, హర్యానా, కర్ణాటక.

నవంబర్ 2: నోంగ్‌క్రెమ్ నృత్యం
మేఘాలయలో జరుపుకునే సంప్రదాయ నోంగ్‌క్రెమ్ నృత్య ఉత్సవం సందర్భంగా ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవు ఉండే రాష్ట్రం: మేఘాలయ.

నవంబర్ 9: దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ
దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

సెలవు ఉండే రాష్ట్రాలు, ప్రాంతాలు: త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్.

నవంబర్ 10: దీపావళి, బలి ప్రతిపద, గోవర్ధన్ పూజ
దీపావళి తర్వాత వచ్చే బలి ప్రతిపద, గోవర్ధన్ పూజ, లక్ష్మీ పూజ, విక్రమ్ సంవత్ నూతన సంవత్సర వేడుకల కారణంగా ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవు ఉండే రాష్ట్రాలు: గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కిం.

నవంబర్ 11: భాయ్ దూజ్, నింగోల్ చకౌబా, చిత్రగుప్త జయంతి
ఈ రోజున భాయ్ దూజ్, నింగోల్ చకౌబా, చిత్రగుప్త జయంతి వంటి పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

సెలవు ఉండే రాష్ట్రాలు: సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్.

నవంబర్ 13: స్థానిక పండుగ సందర్భంగా సెలవు
మేఘాలయలో స్థానిక పండుగ సందర్భంగా ఈ రోజున బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

సెలవు ఉండే రాష్ట్రం: మేఘాలయ.

నవంబర్ 16: ఛత్ పూజ
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఛత్ పూజను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా నవంబర్ 16న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవు ఉండే రాష్ట్రాలు: బీహార్, జార్ఖండ్.

నవంబర్ 20: ఇగాస్-బగ్వాల్ పండుగ
ఉత్తరాఖండ్‌లో సంప్రదాయంగా జరుపుకునే ఇగాస్-బగ్వాల్ పండుగ సందర్భంగా ఈ రోజున బ్యాంకులు పనిచేయవు.

సెలవు ఉండే రాష్ట్రం: ఉత్తరాఖండ్.

నవంబర్ 23: సెంగ్ కుట్ స్నేమ్
మేఘాలయలో జరుపుకునే సెంగ్ కుట్ స్నేమ్ పండుగ సందర్భంగా నవంబర్ 23న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవు ఉండే రాష్ట్రం: మేఘాలయ.

నవంబర్ 24: గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ
నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల్లో గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ కూడా ఉన్నాయి. ఈ పండుగల సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

సెలవు ఉండే రాష్ట్రాలు, ప్రాంతాలు: మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్.

నవంబర్ 27: కనకదాస జయంతి
కర్ణాటకలో ప్రముఖ కవి, భక్తుడైన కనకదాస జయంతిని పురస్కరించుకుని ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవు ఉండే రాష్ట్రం: కర్ణాటక.

బ్యాంకు సెలవుల సమయంలో కస్టమర్లు ఏం చేయాలి?
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ కస్టమర్లు కొన్ని సేవలను ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా:

UPI సేవలు: గూగుల్ పే, ఫోన్‌పే, ఇతర UPI యాప్స్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు.
మొబైల్ బ్యాంకింగ్: బ్యాలెన్స్ చెక్ చేయడం, నగదు బదిలీ వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్: ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.
ATM సేవలు: ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకుకు వెళ్లే ముందు   గుర్తుంచుకోండి!
నవంబర్ నెలలో పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వీకెండ్ సెలవులు కలిపి కొన్ని రోజులు బ్యాంకులు మూసివేయనున్నాయి. అయితే అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన సెలవులు ఉండవు. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు RBI అధికారిక సెలవుల లిస్ట్ లేదా మీ బ్యాంకు వెబ్‌సైట్‌లోని హాలిడే క్యాలెండర్‌ను ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగానే మీ బ్యాంకు పనులను పూర్తి చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.