గెస్ట్స్ కోసం జొమాటో కొత్త ఫీచర్.. ఫుడ్ రేట్లు కనిపించకుండా మెహమాన్ మోడ్!

గెస్ట్స్ కోసం జొమాటో కొత్త ఫీచర్.. ఫుడ్ రేట్లు కనిపించకుండా మెహమాన్ మోడ్!

ఇంట్లో బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం కొన్నిసార్లు కాస్త మొహమాటంగా అనిపిస్తుంది. ఎవరికైనా ఫోన్ ఇచ్చి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి అంటే.. రేటు ఎక్కువ ఉన్న ఐటమ్స్ సెలెక్ట్ చేయడానికి అతిథులు వెనుకాడతారు. ఈ చిన్న మొహమాటాన్ని తొలగించేందుకు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే మెహమాన్ మోడ్.

ఆయుష్మాన్ అగర్వాల్ అనే యూజర్ లింక్డ్ఇన్ వేదికగా చేసిన ఒక చిన్న సూచన ఈ కొత్త ఫీచర్‌కు తెరతీసింది. జొమాటో కో-ఫౌండర్ దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ఐడియాను షేర్ చేశారు. అతిథులు ఫోన్‌లో మెను బ్రౌజ్ చేసేటప్పుడు మెనూలోని ధరలు కనిపించకుండా హైడ్ చేసే ఆప్షన్ ఉంటే బాగుంటుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆలోచన నచ్చిన దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. ఈ వారమే ఆ ఫీచర్‌ను రోల్‌అవుట్ చేయనున్నట్లు ప్రకటించారు.

►ALSO READ | తెలంగాణలో ఐటీ జోరు: పోచారంలో ఇన్ఫోసిస్ కొత్త సాఫ్ట్‌వేర్ బ్లాక్

ఈ 'మెహమాన్ మోడ్' ఎలా పనిచేస్తుందంటే.. హోస్ట్ తమ ఫోన్‌ను అతిథులకు ఇచ్చే ముందు ఈ మోడ్‌ను ఆన్ చేస్తారు. దీనివల్ల అతిథులు తమకు నచ్చిన వంటకాలను రేట్లు చూసి టెన్షన్ పడకుండా స్వేచ్ఛగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హోస్ట్ ఫోన్‌ను వెనక్కి తీసుకుని బిల్లు చెల్లిస్తారు. ముఖ్యంగా పండుగ సీజన్లలో గ్రూప్ ఆర్డరింగ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.

ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలి, కేవలం ధరలు మాత్రమే మాయమవుతాయా లేక టోటల్ బిల్ డిటైల్స్ హైడ్ అవుతాయా అనే పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మొత్తానికి కస్టమర్ల చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా గుర్తించి, జొమాటో తీసుకువస్తున్న ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.