అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ్మోనాది ఓ విద్యార్థిని గొంతు కోసిన ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాప్తాడు ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తునకు అనంతపురం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యార్థిని అతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏపీలో ఉన్మాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడు కేంద్రం. ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నది గోపిక అనే చిన్నారి. రోజు మాదిరిగా.. ఆ పదో తరగతి అమ్మాయి స్కూల్ కు వచ్చింది. క్లాస్ జరుగుతున్నది. ఇదే సమయంలో ఓ రాక్షసుడు స్కూల్ వచ్చాడు. వస్తూ వస్తూ తనతో ఎలక్ట్రిక్ రంపం తీసుకొచ్చాడు. నేరుగా పదో తరగతి క్లాస్ రూంలోకి వెళ్లాడు.
తనతో పాటు తెచ్చిన ఎలక్ట్రిక్ రంపంతో చిన్నారి గోపికపై దాడి చేశాడు. చిన్నారి గోపిక చెయ్యిని కోసేశాడు. రంపంతో గోంతు కోశాడు. ఈ దాడిలో పదో తరగతి చిన్నారి గోపిక చెయ్యి తెగిపోయింది. గోంతుపై లోతుగా గాట్లు పడ్డాయి. పెద్దగా కేకలు వేస్తూ ఆ చిన్నారి తరగతి గదిలోనే కుప్పకూలింది. ఈ ఘటనను అడ్డుకోబోయిన మరో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఈ ఘోరం జరిగిపోయింది. క్లాస్ టీచర్ తో సహా మిగతా అందరూ తేరుకుని అడ్డుకోబోయే లోపు ఆ రాక్షసుడు అక్కడి స్కూల్ నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.
దాడి జరిగిన చిన్నారి గోపిక ఆరోగ్యం విషమంగా ఉందని.. గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. దాడిని అడ్డుకోబోయిన మరో చిన్నారిని ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు డాక్టర్లు.
ఈ ఘటనపై కలకలం రేపుతోంది. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ఓ బయట వ్యక్తి వచ్చి.. ఎలక్ట్రిక్ రంపంతో చిన్నారిపై.. అత్యంత దుర్మార్గంగా.. ఘోరంగా దాడి చేయటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. పెద్ద సంఖ్యలో రాప్తాడు జనం స్కూల్ దగ్గరకు వచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నితమైన అంశం కావటంతో భారీగా మోహరించారు పోలీసులు.
