కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకం పెంపు!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకం పెంపు!

అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లను మార్చింది. అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్న పక్షం రోజుల కాలానికి గాను డీజిల్, విమానాల్లో వాడే ఏటీఎఫ్ ఇంధన ఎగుమతులపై పన్నులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతిపై విధిస్తున్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సున్నాకి తగ్గించింది. ఈ కొత్త పన్ను సవరణలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ATF ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ.10.50 నుంచి రూ. 11కి స్వల్పంగా పెంచారు. అలాగే డీజిల్ ఎగుమతిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ(SAED), రోడ్డు అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సును లీటరుకు రూ.8.50 నుంచి రూ.11.50కి పెంచారు. మరోవైపు గత పక్షం రోజులుగా లీటరుకు రూ. 2.50గా ఉన్న పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని మాత్రం పూర్తిగా తొలగించి సున్నాకి చేర్చారు. అయితే దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి పన్ను మార్పులు చేయలేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

►ALSO READ | గెస్ట్స్ కోసం జొమాటో కొత్త ఫీచర్.. ఫుడ్ రేట్లు కనిపించకుండా మెహమాన్ మోడ్!

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిడ్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా చూడటానికి, ఎగుమతిదారులు విపరీతమైన లాభాలు ఆర్జించకుండా నియంత్రించడానికి ప్రభుత్వం ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తోంది. మార్చి 27 నుంచి ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఈ సుంకాల రేట్లను పరిస్థితులకు తగినట్లుగా సవరిస్తూ వస్తున్నారు. దేశంలో ఇంధన లభ్యతను స్థిరంగా ఉంచేందుకే దీని ఉద్దేశ్యంగా అధికారులు చెబుతున్నారు.