Balu Geetha OTT Release : ఓటీటీలోకి మరో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ.. 'బాలు గీత' ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Balu Geetha OTT Release : ఓటీటీలోకి మరో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ.. 'బాలు గీత' ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'ప్రపంచంలో ప్రతి మగాడి జీవితం ఇంచుమించు ఒకేలా ఉంటుంది... వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చే వరకు' అంటూ అంటూ ఓ ఆసక్తికరమైన డైలాగ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది 'బాలు గీత' సినిమా. ప్రేమ, పెళ్లి, భావోద్వేగాలు, కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. నవంబర్ 5 నుంచి ఈటీవీ విన్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

బాలు, గీత అనే ఇద్దరు యువతీ యువకుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. మొదట సాధారణ పరిచయంగా మొదలైన వీరి ప్రయాణం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే ప్రేమలో పడటం ఎంత సులభమో.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే విషయాన్ని ఈ కథలో చూపించబోతున్నారు. వ్యక్తిగత భయాలు, గత అనుభవాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లపై ఉండే ఒత్తిళ్లు.. ఇలా ఎన్నో అంశాల మధ్య వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది ఆసక్తికరంగా ఉండనుంది.

►ALSO READ | Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ ట్విస్ట్.. ఝాన్సీ ఎలిమినేషన్‌కు ముకేష్ సూపర్ పవర్ కారణమా?

ఈ చిత్రంలో బాలు పాత్రలో సందీప్ సరోజ్, గీతగా కేయూరి షా నటించారు. వీరితో పాటు కృష్ణుడు, యశోరా, రిత్విక్, లోకేశ్, ఎస్‌ఎస్ కాంచి, లహరి పరిచర్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణ్ నాయక్ సంగీతం అందించారు.

పెళ్లి చూపుల పరిచయం నుంచి ప్రేమ ప్రయాణం వరకు సాగే ఈ కథలో నవ్వులు, భావోద్వేగాలు, బంధాల సంఘర్షణ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. మరి బాలు, గీతల ప్రేమకథ ఓటీటీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందా? నవంబర్ 5న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో వేచి చూడాలి.