బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఎలిమినేషన్ల లెక్కలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్ ఒకవైపు.. హౌస్‌లో కంటెస్టెంట్ల పవర్ గేమ్ మరోవైపు.. వెరసి ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ గా సుధీర్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. చివరి నిమిషంలో ముకేష్ సూపర్ పవర్‌తో అతడిని సేవ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒక్క నిర్ణయం మరో కంటెస్టెంట్ కొంప ముంచిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో సుధీర్‌కు తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతూ అతడిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. అయితే ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌ను ఉపయోగించి సుధీర్‌ను సేవ్ చేశాడు. గతంలో వర్షిణి, వంశీలను కూడా తన పవర్‌తో కాపాడిన ముకేష్.. ఇప్పుడు మరోసారి సుధీర్‌కు అండగా నిలిచాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఝాన్సీ దగ్గరున్న సేవింగ్ పవర్‌ను తన వ్యూహంతో ఉపయోగించేలా చేసి, ఆమె చేతిలోని అవకాశాన్ని ముకేష్ దూరం చేసినట్లు సమాచారం
నిజానికి ఆ పవర్ ఝాన్సీ దగ్గరే ఉండి ఉంటే.. తనను తాను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ సుధీర్ కోసం ఆ పవర్‌ను వదులుకోవడంతో ఇప్పుడు ఆమెకే ముప్పు ఎదురైంది.. మరోవైపు వర్షిణి గోట్ గ్రూప్‌లో చోటు దక్కించుకుని ఎలిమినేషన్ నుంచి బయటపడినట్లు సమాచారం. దీంతో ఝాన్సీపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది.
ఇదిలా ఉంటే.. రోహిత్, రామకృష్ణలకు సమాన ఓట్లు రావడంతో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అల్టిమేట్ గోట్ త్రిగుణ్‌కు కీలక నిర్ణయాధికారం ఇస్తే.. తనకు పోటీగా భావించే రోహిత్‌ను బయటకు పంపే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఝాన్సీ ఎనిమిదో వారం ఎలిమినేట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఝాన్సీ బయటకు వెళ్తే.. ఆమె అభిమానులకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి.
