56 ఏళ్ల వయసులో జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి చేసుకున్నారు. కొత్త ప్రయాణం మొదలైందని ‘ఎక్స్’లో ట్వీట్ చేసిన ఆయన ఫొటోలు పోస్ట్ చేశారు. ప్రముఖ మహిళా జర్నలిస్ట్ నిధి రజ్దాన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత దిగిన పోస్ట్ వెడ్డింగ్ ఫొటోలను ఒమర్ అబ్దుల్లా, నిధి రజ్దాన్ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాల్లో పోస్ట్ చేశారు. నిధి రజ్దాన్కు కూడా ఇది రెండో పెళ్లినే కావడం గమనార్హం.
A new journey began yesterday 💍@Nidhi https://t.co/BXbdLq2d1H
— Omar Abdullah (@OmarAbdullah) October 31, 2026
ఒమర్ అబ్దుల్లా తన మొదటి భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు తీసుకున్నారు. 2026 జూలై 31న వారి పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. విడాకులు తీసుకున్న మూడు నెలలకు ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి చేసుకున్నారు. ఒమర్ అబ్దుల్లాకు, పాయల్కు జహీర్, జమీర్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2009లోనే ఈ జంట విడిపోయింది. 2011లో ఒమర్ అబ్దుల్లా, పాయల్ విడిపోయినట్లు బహిర్గతమైంది.
ఇక ఒమర్ అబ్దుల్లా పెళ్లి చేసుకున్న పాత్రికేయురాలు నిధి రజ్దాన్ విషయానికొస్తే.. NDTVతో ఆమెకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈ న్యూస్ ఛానల్లో ఆమె ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేశారు. 'లెఫ్ట్, రైట్ & సెంటర్' అనే ప్రోగ్రాం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
భారత రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, జమ్మూ కాశ్మీర్‌లోని పరిణామాలపై విస్తృతంగా వార్తలు, విశ్లేషణలు అందించారు. మీడియా రంగంలో ఆమె చేసిన కృషికి జర్నలిజం వృత్తిలో గౌరవంగా భావించే రామ్‌నాథ్ గోయెంకా అవార్డు ఆమెకు దక్కింది.
