కొండపాక (కుక్కునూరు పల్లి), వెలుగు : మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న బ్లాస్టింగ్ వల్ల ప్రాజెక్టు కట్టకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు.
తిప్పారంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న ఇన్టెక్ వెల్ పనుల్లో భాగంగా ఈ పేలుళ్లు జరుపుతున్నారని, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును కూలగొట్టే కుట్ర ఉందని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
