మాజీ మావోయిస్టుల నిర్బంధం పౌరహక్కుల ఉల్లంఘనే : పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌‌ హర గోపాల్‌‌

మాజీ మావోయిస్టుల నిర్బంధం పౌరహక్కుల ఉల్లంఘనే : పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌‌ హర గోపాల్‌‌

నారాయణగూడ, వెలుగు :   లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని పోలీస్‌‌ క్యాంపుల్లో నిర్బంధించడం పౌరహక్కుల ఉల్లంఘనేనని పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌‌ హరగోపాల్‌‌ అన్నారు. హైదర్‌‌గూడలోని ఎన్ఎస్ఎస్‌‌లో పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్‌‌లో ఉన్న పునరావాస కేంద్రంలో శిక్షణ పొందుతున్న మాజీ మావోయిస్టు నర్సు బొడ్డు అలియాస్‌‌ నైతి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. 

పోలీస్‌‌ క్యాంపులను ఎత్తివేసి, నిర్బంధంలో ఉన్న మాజీ మావోయిస్టులు స్వేచ్ఛగా బతికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌ లక్ష్మణ్‌‌ గడ్డం, ప్రధాన కార్యదర్శి ఎన్‌‌.నారాయణరావు పాల్గొన్నారు.