ఒమేగా హాస్పిటల్స్‌‌పై ఐటీ రెయిడ్స్

ఒమేగా హాస్పిటల్స్‌‌పై ఐటీ రెయిడ్స్
  • 25 చోట్ల డాక్యుమెంట్లు, హార్డ్‌‌డిస్క్‌‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: ఒమేగా హాస్పిటల్స్‌‌ నెట్‌‌వర్క్‌‌పై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు మధ్యప్రదేశ్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌, ఉత్తరాఖండ్‌‌ రాష్ట్రాల్లో మొత్తం 24 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.  హైదరాబాద్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ వింగ్‌‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌‌లో పాల్గొన్నాయి.  

ఆస్పత్రుల శాఖలు, కార్యాలయాలతో పాటు కీలక డాక్టర్లు, యాజమాన్య ప్రతినిధుల నివాసాల్లోనూ అధికారులు రెయిడ్స్​నిర్వహించారు. ఒమేగా హాస్పిటల్స్‌‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులు, నగదు లావాదేవీల వివరాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్‌‌ హార్డ్‌‌డిస్క్‌‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సోదాలపై ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.