న్యూఢిల్లీ: దేశీయ టెక్ కంపెనీ కార్బన్ మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. కార్బన్ రెబెల్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో రెబెల్, రెబెల్ ప్రో మోడళ్లను తీసుకురానుంది. ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. రెబెల్ ప్రో ఫోన్ 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120 హెజ్ రిఫ్రెష్ రేట్, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెబెల్ మోడల్‌లో 6.75 ఇంచుల డిస్‌ప్లే, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
