ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను.. సీఎం చంద్రబాబు ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ !

ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను.. సీఎం చంద్రబాబు ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ !

అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాతావరణ పరిస్థితులు, తుఫాను ప్రభావం, పునరుద్ధరణ పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో వాతావరణ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం రేపటికి (నవంబర్ 1, 2026) తుఫానుగా బలపడే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో.. గుంటూరు నుంచి దక్షిణ దిశలోని దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

నవంబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ క్రమంలో.. సంబంధిత శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.