హైదరాబాద్ ఉప్పల్లో ఉండేటోళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!

హైదరాబాద్ ఉప్పల్లో ఉండేటోళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!

హైదరాబాద్: ఉప్పల్ రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని షెడ్డును హైడ్రా సిబ్బంది తొలగించారు. రామంతాపూర్ పెద్ద చెరువు పరిధిలో 400 గజాలకు పైగా ఖాళీ స్థలంలో అక్రమంగా తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసి.. షెడ్డులో అనుమతులు లేకుండా బార్ సిట్టింగ్ రూం నిర్వహిస్తున్నట్లు హైడ్రా అధికారులు తేల్చారు.

పక్కనే ఉన్న భవనంలో బార్ నిర్వహణకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. సిట్టింగ్ రూంలో మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

బహిరంగంగా మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు హైడ్రాకు మొరపెట్టుకున్నారు. చెరువు కట్టపై మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను చెరువులోకి విసురుతున్నారని ఫిర్యాదు చేశారు. పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా షెడ్డును తొలగించింది. తొలగించిన షెడ్డుకు సంబంధించిన స్థలాన్ని చెరువు అభివృద్ధిలో హైడ్రా భాగస్వామ్యం చేసింది.