కరీంనగర్: కొత్తపల్లి మండలం బావుపేట దగ్గర ఆర్టీసీ బస్సు, గ్రానైట్ బండరాళ్ల కంటైనర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగం ప్రమాద ధాటికి ధ్వంసమైంది. 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బావుపేట ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు.
కంటైనర్ లారీ ఢీకొని గాయపడిన సిరిసిల్ల ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికులకు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, పోలీస్ కమిషనర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
