బంగాళాఖాతంలో అల్పపీడనం..మురసు తుఫాను ఎఫెక్ట్.. ఏపీ తీరానికి పొంచి ఉన్న ముప్పు

బంగాళాఖాతంలో అల్పపీడనం..మురసు తుఫాను ఎఫెక్ట్.. ఏపీ తీరానికి పొంచి ఉన్న ముప్పు

ఏపీకి  మరో తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటలలో తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మురసు అని పిలువబడే ఈ తుఫాను నవంబర్ 3(మంగళవారం) ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుని,నెల్లూరు - నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  

ఈ తుఫాను ప్రభావంతో నవంబర్ 2, 3 తేదీల్లో దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని IMD అలర్ట్ జారీ చేసింది.