సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 17న ప్రారంభం కాగా, నవంబర్ 15 వరకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 327.
విభాగాల వారీగా ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ (జనరల్) 70, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) 60, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) 10, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్- సివిల్) 22, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్) 5, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్- మెకానికల్) 4, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్) 78, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్) 78.
విద్యార్హతలు
అసిస్టెంట్ మేనేజర్ (జనరల్): ఏదైనా విభాగంలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ విభాగంలో బి.టెక్/ బీఈ పూర్తిచేసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి, ఫైనాన్స్ & అకౌంటింగ్ విభాగంలో డిగ్రీ అనంతరం కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో డిగ్రీతోపాటు సీఏ ఇంటర్మీడియట్ లేదా సీఎంఏ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్- సివిల్, ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్-మెకానికల్): సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్): ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే, కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్): అగ్రికల్చర్, బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్, కెమిస్ట్రీ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్, ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ పై ప్రాథమిక పరిజ్ఞానం, పని చేసే అనుభవం ఉండాలి.
వయసు: 2026, నవంబర్ 15 నాటికి 28 ఏళ్లు మించకూడదు. అంటే అభ్యర్థులు1998, నవంబర్ 16 కంటే ముందు 2008, నవంబర్ 15 తర్వాత జన్మించి ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులు రూ. 500, అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1350 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్
అసిస్టెంట్ మేనేజర్: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.cewacor.nic.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
