బయోటెక్నాలజీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. CDFDలో సైంటిస్ట్ పోస్టులు

బయోటెక్నాలజీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. CDFDలో సైంటిస్ట్ పోస్టులు

హైదరాబాద్‌లోని ప్రముఖ బయోటెక్నాలజీ రీసెర్చ్ సంస్థ అయిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్​డీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 6.

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్ –V 2, సైంటిస్ట్ I-V 2, , సైంటిస్ట్ II 2.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, కంప్యుటేషనల్ బయాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ, అగ్రికల్చరల్ సైన్సెస్, ప్లాంట్ సైన్సెస్ లేదా సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. లేదా కెమికల్, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ రంగాల్లో పీహెచ్‌డీ  కలిగి ఉండాలి. లేదా ఎండీ/ ఎండీఎస్/ ఎంవీఎస్​సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు: 45 ఏళ్లు మించకూడదు. 

అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.1500 చెల్లించాలి. 

లాస్ట్ డేట్:  డిసెంబర్ 31.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్cdfd.org.inను సందర్శించండి.


– వెలుగు, ఎడ్యుకేషన్