- టైటిల్ : ధూమకేతు
- డైరెక్షన్ : సుధి మద్దిసన్
- కాస్ట్ : సజిన్ గోపు, నిఖిలా విమల్, షైన్ టామ్ చాకో
- ప్లాట్ఫాం : నెట్ఫ్లిక్స్
కుట్టన్ (సజిన్ గోపు)ను షర్మిళ (నిఖిలా విమల్) పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో ధూమకేతు అనే తోకచుక్క భూమికి దగ్గరగా వెళ్లనుందనే వార్తలు టీవీల్లో హల్చల్ చేస్తుంటాయి. దాని ప్రభావంతో భూమిపై అనేక మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు చెప్తుంటారు.
ఈ నేపథ్యంలోనే కుట్టన్, షర్మిళల వివాహం జరుగుతుంది. శోభనం రాత్రికి ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. అయితే ఆ రాత్రి మాస్కులు ధరించిన కొందరు దుండగులు తనపై దాడి చేసి శోభనాన్ని అడ్డుకున్నట్లు కుట్టన్కు అనిపిస్తుంది. నిద్రలేచి చూస్తే, అప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ మళ్లీ యథాతథంగా పునరావృతమవుతుంటాయి.
శోభనం గదిలోకి వెళ్లిన ప్రతిసారీ దాడి జరగడం, ఆ తర్వాత మళ్లీ అదే రోజు ఉదయానికి చేరుకోవడం అతన్ని అయోమయానికి గురిచేస్తుంది. క్రమంగా తాను టైమ్ లూప్లో చిక్కుకున్నానని కుట్టన్కు అర్థమవుతుంది. దీంతో జరుగుతున్న సంఘటనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ ఆ మాస్క్ మనుషులు ఎవరు? అంతుచిక్కని టైమ్ లూప్ నుంచి కుట్టన్, షర్మిళ ఎలా బయటపడతారు? అన్నదే మిగతా కథ.
