స్ట్రీమ్ ఎంగేజ్: దహాన్.. రాత్రివేళ వింత శబ్దాలు.. బంగ్లా, భూములను అమ్మి వెళ్లాలని నిర్ణయం

స్ట్రీమ్ ఎంగేజ్: దహాన్.. రాత్రివేళ వింత శబ్దాలు.. బంగ్లా, భూములను అమ్మి వెళ్లాలని నిర్ణయం
  • టైటిల్ : దహాన్
  • కాస్ట్ : బార్షా నాయక్, ఆరోషికా మిశ్రా, సామ్రాట్ మహాపాత్ర, ప్రణబ్ ప్రసన్న రాథ్
  • డైరెక్షన్ : అనుపమ్ పట్నాయక్
  • ప్లాట్​ఫాం : ఆహా

ఫారెస్ట్ ఏరియాకు దగ్గరగా ఉన్న బంగ్లాలో ఒంటరిగా ఉండే జమీందారు ఓ రోజు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. కొంతకాలానికి బంగ్లా పాడుబడిపోగా, ఆయనకు చెందిన భూములను ఇతరులు సాగు చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జమీందారు వారసురాలైన ఆనందిత తన తమ్ముడు సమర్, చెల్లెలు మనూతో కలిసి అక్కడికి వస్తుంది. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా బంగ్లాతో పాటు భూములను కూడా అమ్మేసి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఓసారి భూముల అమ్మకం పనుల మీద ఆనందిత బయటకు వెళ్లినప్పుడు మనూ ఆ అవుట్‌‌హౌస్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఓ చెక్కపెట్టెను చూస్తుంది.

 అప్పటి నుంచి మనూ ప్రవర్తనలో మార్పు మొదలవుతుంది. రాత్రివేళ ఆ పెట్టెలో నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. అసలు ఆ పెట్టె తమ ఇంటికి ఎలా వచ్చింది? ఆ పెట్టెను తెరిచినప్పటి నుంచే మనూలో ఎందుకు మార్పు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా? లేదా? అన్నదే మిగతా కథ.