ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భానుర్ యూనిట్‌లోని అప్రెంటిస్ సెల్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతున్నారు.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ (ఇంజినీరింగ్).
మొత్తం పోస్టులు: 134.
విభాగాల వారీగా ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్): మెకానికల్ 40, సీఎస్ఈ/ ఐటీ 2, ఈసీఈ 30, ఈఈఈ 3, కెమికల్ 3.
డిప్లొమా అప్రెంటిస్ (ఇంజినీరింగ్): మెకానికల్ 34, సీఎస్ఈ/ ఐటీ 1, ఈసీఈ 15, ఈఈఈ 2, సివిల్ 2, కెమికల్ 2.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్
పూర్తిచేసి ఉండాలి.
సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, క్యాటగిరీల వారీగా షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bdl-india.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
