ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఓపెన్ టాప్ జీపులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి

ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఓపెన్ టాప్ జీపులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న  ఓట్ బచావో – దేశ్ బచావో మహా ర్యాలీకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు  వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు,కార్యకర్తలు  పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు రామ్‌లీలా మైదానానికి ర్యాలీగా వెళ్లారు. 

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ఇండియా కూటమి అగ్రనేతలు రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లు ఓపెన్ టాప్ జీపుల్లో ర్యాలీగా వెళ్లారు. 

ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపు ఆరోపణలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇండియా కూటమి నేతలు పాల్గొని తమ నిరసనను తెలియజేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న ఈ మహా ర్యాలీతో ఢిల్లీలో రాజకీయ సందడి నెలకొంది.