ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి రామ్‌లీలా మార్చ్ లో పాల్గొనాలని, అదే సమయంలో స్థానిక వ్యాపారులకు అండగా నిలవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలు, ర్యాలీలతో పాటు పండుగల షాపింగ్ కూడా చేయాలని సూచించారు. దీంతో ఢిల్లీలోని చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం దేశంలో దీపావళి, ఛత్ పూజ, భాయ్ దూజ్ వంటి పండుగల సందడి కొనసాగుతోందని రాహుల్ గుర్తుచేశారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఢిల్లీకి వస్తున్నారు.. ర్యాలీకి వచ్చే వారంతా తమ సమయాన్ని కేటాయించి స్థానిక దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయాలని కోరారు. అలా చేస్తే పండుగల సమయంలో వ్యాపారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించినట్లు అవుతుందని చెప్పారు.
ర్యాలీలతో వ్యాపారులకు నష్టం జరుగుతుందంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాహుల్ విమర్శించారు. నిరసనలు, మార్చ్‌లు నిర్వహించుకోవడంతో పాటు షాపింగ్ కూడా చేయవచ్చన్నారు. ఈ రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.
ALSO READ : ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ..
ఢిల్లీ కాంగ్రెస్ రామ్ లీలా మార్చ్ ఉంటుంది.. అదే సమయంలో లక్షలాది మంది ప్రజలు స్థానిక చిన్న వ్యాపారుల వద్ద కొనుగోళ్లు చేస్తారు. ప్రజలు నిరసనల్లో పాల్గొంటూనే వ్యాపారులకు మద్దతు ఇవ్వాలి” అని రాహుల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
नमस्कार, कल लाखों लोग रामलीला मार्च के लिए दिल्ली आ रहे हैं। त्यौहारों का मौसम है। दिवाली, छठ, भाईदूज का समय है। मैं चाहता हूं जो लाखों लोग बाहर से दिल्ली आ रहे हैं, वो यहां के व्यापारियों की मदद करें। प्रोटेस्ट, मार्च, रैली कीजिए, साथ में थोड़ी सी खरीदारी भी कीजिए - व्यापारियों का फायदा हो जाएगा। मैं जानता हूं व्यापारियों को रैली नुकसान नहीं पहुंचाएगी। BJP डरी हुई है इसलिए अफवाह फैला रही है। मगर, दोनों काम करते हैं। कल मार्च होगा, रैली होगी और लाखों लोग हमारे व्यापारियों की छोटी-छोटी दुकानों में से सामान खरीदेंगे। आप सबको बहुत-बहुत प्यार। शुभ दिवाली। जय हिंद। : नेता विपक्ष श्री @RahulGandhi
— Congress (@INCIndia) October 31, 2026
