ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్లలో గుర్తులు తారుమారు.. రెండు గంటలు నిలిచిన పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్లలో గుర్తులు తారుమారు.. రెండు గంటలు నిలిచిన పోలింగ్

ఏపీమున్సిపల్  ఎన్నికలు రసాభాసగా మారాయి. పలు చోట్ల అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందిన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ  నియోజకవర్గంలోని ఓల్డ్ రాజ రాజేశ్వరి పేట 55వ డివిజన్ లో బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల గుర్తులు తారు  మారు కావడంతో ఓటర్లు, అభ్యర్థులు షాకయ్యారు. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదురుగా వైసీపీ ఫ్యాన్ గుర్తు ముద్రితమయ్యాయి.

ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారులు వెంటనే 55వ డివిజన్‌లో పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్త బ్యాలెట్ పేపర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ పరిణామంతో 55వ డివిజన్‌లో పోలింగ్ సుమారు రెండు గంటలు ఆలస్యమైనట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణలో జరిగిన ఈ పొరపాటుపై స్థానికంగా చర్చనీయాంశమైంది.