ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అడ్మిన్ గా కె. ప్రసాద్

ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అడ్మిన్ గా కె. ప్రసాద్

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ (అడ్మిన్) గా కే. ప్రసాద్‌ నియమితులయ్యారు. సెక్రటేరియట్ చీఫ్ ఇంజనీర్ (ఎంక్వైరీస్) గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ ఈఎన్సీ అయిన తమటం శ్రీనివాస్‌ కు ప్రభుత్వం జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు గడువు పొడిగించింది. 

అయితే ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్తుండంతో ఆయన స్థానంలో ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటర్ స్టేట్ సీఈగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.