పుల్కల్, వెలుగు : సంగారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా డ్యాంలోకి శనివారం నీటిని విడుదల చేశారు.
తాగునీటి సరఫరాకు ఇబ్బందుల్లేకుండా ప్రాజెక్టులోని 4, 5, 6 నంబర్ గేట్లను మీటర్ మేర ఎత్తి 0.15 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.289 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ ఏఈ నవీన్ తెలిపారు.
