హైదరాబాద్: హైదరాబాద్‌లో రేపు (నవంబర్ 2, 2026) బీజేపీ పాదయాత్ర, హోంమంత్రి అమిత్ షా పర్యటన ఉండటంతో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు బీజేపీ పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే.
* పాదయాత్ర నేపథ్యంలో పలు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు
* బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
* ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లింపు
* జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లింపు
* లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతి నిరాకరణ.. హిమాయత్‌నగర్ వైపు మళ్లింపు
* హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లింపు
* బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బోగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ మళ్లింపులు
* ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వాహనాలకు అనుమతి లేదు
* జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత
* లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం జంక్షన్లను తప్పించుకోవాలని సూచన
* ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్, తాజ్ ఐలాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశం
* నాంపల్లి, అబిడ్స్, రామకోటి, కోఠి, చాదర్‌ఘాట్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు
* ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల మళ్లింపు
* నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని సూచన
* ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచన
