Diwali 2026: నవంబర్ 8వ తేదీనే దీపావళి పండుగ.. 9 వ తేదీ కాదు..

Diwali 2026: నవంబర్ 8వ తేదీనే దీపావళి పండుగ.. 9 వ తేదీ కాదు..

హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ఈ ఏడాది(2026) దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి.  చీకటిపై వెలుగుల విజయానికి సంకేతమైన ఈ పండుగలో, లక్ష్మీదేవి పూజశుభ ముహూర్తం ఎప్పుడు.. దీపావళి పండుగ పూజా సమయం.. తేదీ  మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .

హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి. ప్రతి ఏడాది  ఆశ్వయుజమాసం అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు.  చీకటిపై వెలుగుకు ప్రతీకగా ఈ పండుగను నవంబర్​ 8 వ తేదీన జరుపుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి లక్ష్మీ గణేశులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 

హిందూ పంచాంగం ప్రకారం, 2026లో దీపావళి పండుగను నవంబర్ 8వ తేదీ, ఆదివారం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.దీపావళి పండుగను  అమావాస్య తిథి, ప్రదోషకాలం ఆధారంగా  నిర్ణయిస్తారు. 

దీపావళి పూజ ముహూర్తం, తిథి వివరాలు

 

  •  పండుగ తేదీ: నవంబర్ 8.. ఆదివారం 
  •   అమావాస్య తిథి ప్రారంభం: నవంబర్ 8 ఉదయం 11:27 గంటలకు
  •   అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 9 మధ్యాహ్నం 12:31 గంటలకు
  •   లక్ష్మీ పూజ ముహూర్తం:  నవంబర్ 8 సాయంత్రం 5:54 నుంచి రాత్రి 7:50 వరకు
  •   ప్రదోషకాలం:  నవంబర్ 8సాయంత్రం 5:31 నుంచి రాత్రి 8:09 వరకు

పంచాంగం ప్రకారం ఆశ్వయుజమాసం అమావాస్య తిథి ఘడియలు  ప్రదోషకాలంలో నవంబర్​ 8 వ తేదిన ఉన్నాయి.  కాబట్టి ఆరోజునే దీపావళి పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

దీపావళి  ( నవంబర్​ 8) రోజున  లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావించి ఆరాధిస్తారు.  కేదారీశ్వర వ్రతాలు కూడా నిర్వహిస్తారు. గణేశుడిని విఘ్నాలను తొలగించే దేవుడిగా, శుభకార్యాలకు ఆదిదేవుడిగా పూజిస్తారు.

 జీవితంలో ఆర్థిక సౌభాగ్యంతో పాటు జ్ఞానం, వివేకం, ఆటంకాలు లేని పురోగతి ఉండాలని భక్తులు ఈ సందర్భంగా ప్రార్థిస్తారు. కొన్ని కుటుంబాల్లో కుబేరుడిని కూడా పూజించే సంప్రదాయం ఉంది. వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభించి, తమ వ్యాపారాభివృద్ధి కోసం దైవానుగ్రహాన్ని కోరుకుంటారు. అదే రోజు టపాసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకుంటారు.