జ్యోతిష్యం: ఏ రాశి వారు ఏ మంత్రం నిత్యం చదవాలి..జాతక దోషాలు పోవాలంటే చేయాల్సింది ఇదే..!

జ్యోతిష్యం: ఏ రాశి వారు ఏ మంత్రం  నిత్యం చదవాలి..జాతక దోషాలు పోవాలంటే చేయాల్సింది ఇదే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయంలో లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి బలంగా ఉంటే జాతకంలో ఎటువంటి దోషమైనా తొలగిపోతుంది.అలా లేకపోతే జాతక దోషాలు వెంటాడుతాయి.  ఈ అధిపతులు బలంగా ఉండడానికి, యోగాలు పట్టించడానికి జ్యోతిష గ్రంథాల ద్వారా తెలుస్తుంది.   ఏరాశికి ఏ గ్రహం అధిపతి ఎవరు.. అధిష్ఠాన దేవత ఎవరు.. జాతక దోషాలు తొలగాలంటే నిత్యం ఎవరు ఏ మంత్రాన్ని చదవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. 

 ప్రతి గ్రహానికి ఒక అధిష్ఠాన దేవత ఉంటుంది. ఆ అధిష్ఠాన దేవతను నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి, శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ద్వాదశ రాశుల మంత్రములు 

 మేష రాశి   

  • ఈ రాశికి అధిపతి:  కుజుడు 
  • అధిష్ఠాన దేవత  :సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః

 వృషభరాశి

  • ఈ రాశికి అధిపతి:  శుక్రుడు
  • అధిష్ఠాన దేవత  : లక్ష్మీదేవి , హయగ్రీవుడు.
  • నిత్యం చదవాల్సిన మంత్రం : ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమః

మిథున రాశి 

  • ఈ రాశికి అధిపతి:  బుధుడు
  • అధిష్ఠాన దేవత  : గణపతి 
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం క్లీం కృష్ణాయ నమః 

కర్కాటక రాశి 

  • ఈ రాశికి అధిపతి:   చంద్రుడు
  • అధిష్ఠాన దేవత  :దుర్గాదేవి
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం క్లీం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః 

 సింహరాశి

  • ఈ రాశికి అధిపతి:   సూర్యడు
  • అధిష్ఠాన దేవత  :ఆదిత్యుడు ( సూర్యభగవానుడు)
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః 

 కన్యారాశి 

  • ఈ రాశికి అధిపతి:   బుధుడు
  • అధిష్ఠాన దేవత  :వినాయకుడు, విష్ణుమూర్తి
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః 

 తులారాశి 

  • ఈ రాశికి అధిపతి:  శుక్రుడు
  • అధిష్ఠాన దేవత  :లక్ష్మీదేవి
  • నిత్యం చదవాల్సిన మంత్రం : ఓం తత్వ నిరంజనాయ తారకరామాయ నమః 

 వృశ్చికరాశి 

  • ఈ రాశికి అధిపతి:  కుజుడు
  • అధిష్ఠాన దేవత  :శుభ్రమణ్యస్వామి, ఆంజనేయస్వామి
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం నారాయణాయ నరసింహాయ నమః 

 ధనస్సురాశి 

  • ఈ రాశికి అధిపతి:  గురుడు
  • అధిష్ఠాన దేవత  : దుర్గాదేవి
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః 

 మకరరాశి 

  • ఈ రాశికి అధిపతి:  :శని
  • అధిష్ఠాన దేవత  :శివుడు
  • నిత్యం చదవాల్సిన మంత్రం : ఓం శ్రీ వత్సలాయ నమః 

 కుంభరాశి 

  • ఈ రాశికి అధిపతి:  శని
  • అధిష్ఠాన దేవత  :శివుడు, నరసింహస్వామి
  • నిత్యం చదవాల్సిన మంత్రం : ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః 

 మీనరాశి

  • ఈ రాశికి అధిపతి:  గురుడు
  • అధిష్ఠాన దేవత  :దుర్గాదేవి, దత్తాత్రేయస్వామి
  • నిత్యం చదవాల్సిన మంత్రం :ఓం క్లీం ఉధృతాయ ఉద్దారిణే నమః

ఈ మంత్రాలను నిత్యం భక్తితో 108 సార్లు జపం చేయడం వలన  శరీరంలో ఆత్మ-ప్రాణశక్తి పెరుగుతుంది. శుల ననుసరించి ప మహామంత్రాల్ని జపిస్తే మానవుడు చాలా భాగం మాయ నుండి బయట పడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  సృష్టి స్థితి లయలకు మాయ మూలస్థానం. దీనికి లోబడే జగత్తు కాలభ్రమణమవుతోంది . మయుడు మాయకే సూత్రధారి. అదే విష్ణుమాయ. త్రిమూర్తులు కూడా మాయ బద్దులే భవిష్య పురాణం ద్వారా తెలుస్తుంది.  

మానవుడు జాగ్రత్తగా ఉంటూ , ధార్మిక నియమాలు పాటిస్తూ ఉంటే , సర్వశుభాలు సమకూరుటయేగాక , మరొక జన్మలేని పరమపదాన్ని చేరతాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.  లోకకళ్యాణం కోసం మానవుడు ఏ కార్యం ఆచరిస్తాడో అదే సత్యం . అదే ధర్మం . అదే సత్య ధర్మమని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.