Ranabaali OTT: థియేటర్లలో రన్ కొనసాగుతుండగానే.. ఓటీటీలోకి రణబాలి..!

Ranabaali OTT: థియేటర్లలో రన్ కొనసాగుతుండగానే.. ఓటీటీలోకి రణబాలి..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత, మౌత్ టాక్‌తో కొంత పుంజుకుంది. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో లాంగ్ రన్ కొనసాగిస్తూ, వసూళ్లను అందుకుంటుంది. ఈ క్రమంలోనే రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు రావడం దేవరకొండ ఫ్యాన్స్కు షాక్ ఇస్తుంది. ముఖ్యంగా, సినిమా విడుదలై నెల రోజులు కూడా పూర్తికాకుండానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి రానుండటంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మరి రణబాలి స్ట్రీమింగ్ఎప్పుడు? ఎక్కడ అనే పూర్తి వివరాలు చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘రణబాలి’?

‘రణబాలి’ OTT హక్కులను ప్రముఖ టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజా గా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించింది. అప్పటికే కొందరు నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రణబాలి OTT రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. తొలగించిన పోస్టు ప్రకారం, రణబాలి నవంబర్ 13, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటుగా పాన్ ఇండియా భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి మరోసారి అనౌన్స్ వచ్చాకే స్ట్రీమింగ్ డేట్పై క్లారిటీ వస్తుంది. 

‘రణబాలి’ వసూళ్లు ఎంతంటే?

అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ‘రణబాలి’, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో సుమారు రూ.58.32 కోట్లు నెట్, రూ.67.72 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. విదేశీ మార్కెట్లలో సుమారు రూ.12.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

విజయ్, రష్మిక కెమిస్ట్రీకి మరోసారి గుర్తింపు

రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలిగా కనిపించగా, రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటించింది. బ్రిటిష్ వలస పాలన, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందింది. మరి థియేటర్లలో మిక్సెడ్ టాక్ అందుకున్న ‘రణబాలి’, ఇప్పుడు OTTలో ఎలాంటి స్పందన అందుకోనుందనే ఆసక్తి నెలకొంది.