‘మురసు తుపాను’ అర్నబ్ తుపాను కంటే డేంజర్ ఉందిగా !

‘మురసు తుపాను’ అర్నబ్ తుపాను కంటే డేంజర్ ఉందిగా !

హైదరాబాద్: బంగాళాఖాతంలో ‘మురసు తుపాను’ అల్లకల్లోలం సృష్టిస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 27 కి.మీ వేగంతో తుపాను కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకి 480 కిమీ, నెల్లూరుకు 550 కిమీ, మచిలీపట్నానికి 560 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఒంగోలుకు 600 కిమీ, విశాఖపట్నానికి 610 కిమీ దూరంలో కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు(నవంబర్ 2, 2026) ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.

రేపు(నవంబర్ 2, 2026) అర్ధరాత్రి–ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు--నరసాపురం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ తుపాను ప్రభావంతో రానున్న మూడురోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు (ఆదివారం) కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

* ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు
* అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు  కురిసే అవకాశం 
* నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం