హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్నగరానికి తాగునీరు సరఫరా చేసే గండిపేట కాండ్యూట్‌లో భారీ లీకేజీలకు రిపేర్లు చేపట్టనున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు. సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన లీకేజీలను అరికట్టే పనులు ఈ నెల 3న ఉదయం 6 గంటల నుంచి 4న సాయంత్రం 6 గంటల వరకు 36 గంటలపాటు కొనసాగుతాయన్నారు.
ఈ కారణంగా గోషామహల్, కార్వాన్ సర్కిళ్ల పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఆదర్శ్‌నగర్, గన్‌ఫౌండ్రీ తదితర ప్రాంతాలకు, గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్‌బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్, కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ, జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్ ప్రాంతాలకు నీటి సప్లై ఉండదని తెలిపారు. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని, పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
