రామగుండం కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీలో..నిధుల గోల్ మాల్!

రామగుండం కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీలో..నిధుల గోల్ మాల్!
  •     13 మంది ఉద్యోగుల పాత్రపై విజిలెన్స్ రిపోర్ట్​

హైదరాబాద్, వెలుగు: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీల్లో జరిగిన నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్​శాఖ సెక్రటరీ టి.కె. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన అవినీతి అక్రమాలపై 2025 చివరలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. 

రామగుండంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్, అకౌంట్స్ విభాగాల్లో రికార్డులను పరిశీలించగా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలింది. విజిలెన్స్​అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​ఆఫీసర్లు అందించిన నివేదిక ఆధారంగా 13 మంది ప్రభుత్వ ఉద్యోగులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.