వారణాసిలో వంతెనకు నమో బ్రిడ్జ్ పేరు: రైల్వే మంత్రి

వారణాసిలో వంతెనకు నమో బ్రిడ్జ్ పేరు: రైల్వే మంత్రి

ఉత్తరప్రదేశ్: వారణాసిలో గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు ‘నమో బ్రిడ్జ్’ అని పేరు పెట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మోడల్ రైల్వే స్టేషన్‌‌గా అభివృద్ధి చేస్తున్న కాశీ స్టేషన్‌‌తోపాటు ఈ వంతెన నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం బనారస్ రైల్వే స్టేషన్‌‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి వారణాసి–-న్యూఢిల్లీ మధ్య కొత్త ‘వందే భారత్ స్లీపర్’ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ రాబోయే వందేండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వంతెన డిజైన్‌‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

ఈ ప్రాజెక్ట్ మూడేండ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు. నమో ఘాట్ పక్కనే నిర్మిస్తున్న ఈ వంతెన ప్రాజెక్ట్​కు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.